ఐసీసీ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో కొన్ని జవాబు లేని ప్రశ్నలుగా మిగిలాయని నిషేధంలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నియమనిబంధనలను శుక్రవారం విడుదల చేసింది.
వీటిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్లను నియమించడం, మ్యాచ్లకు ముందు 14 రోజుల ఐసోలేషన్ శిక్షణా శిబిరం సహా బంతిని అందించేప్పుడు అంపైర్లు చేతికి తొడుగులు ఉపయోగించాలనే నిబంధనలతో పాటు మరికొన్నింటిని అమలు చేయనున్నట్లు తెలిపింది ఐసీసీ. దీనిపై బంగ్లా ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ స్పందించాడు.
"3 లేక 6 కాదు ఏకంగా 12 అడుగుల్లోపు ఉన్నా వైరస్ సోకే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఓవర్ అయిపోయిన తర్వాత మైదానంలో ఇద్దరు బ్యాట్స్మెన్లు కలిసి ఎలా చర్చించుకుంటారు? వారు వారి క్రీజ్లో నిలబడతారా? స్టేడియంలో జనసమూహం ఉండదా? వికెట్ కీపర్ దూరం నిలబడతాడా? దగ్గరగా ఉండే ఫీల్డర్ల పరిస్థితి ఏంటి? ఈ విషయాలపై కచ్చితంగా చర్చ అవసరం.