టెస్టు ఫార్మాట్‌కు సంబంధించిన ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసింది. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 600 వికెట్ల మైలురాయిని చేరుకొని.. ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా ఘనత సాధించాడు.
ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో ఆరు స్థానాలను మెరుగుపరచుకుని 781 పాయింట్లతో 8వ స్థానానికి చేరాడు అండర్సన్. టాప్-10లో ఉన్న ఏకైక భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా.. 779 పాయింట్లతో అండర్సన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
లైన్ అండ్ లెంగ్త్.. స్వింగ్.. ఈ రెండింటిని నమ్ముకొని క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ వికెట్లు సాధిస్తాడు జేమ్స్ అండర్సన్. వసీం అక్రమ్ తర్వాత ప్రపంచ క్రికెట్లో స్వింగ్ అనగానే గుర్తొచ్చే ఫాస్ట్‌బౌలర్ అతనే. అక్రమ్ అంత వేగం, వైవిధ్యం లేకపోయినా.. అతనంత గొప్ప పేరూ తెచ్చుకోకపోయినా.. అక్రమ్ కూడా అందుకోలేని 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు జేమ్స్.
టెస్టు ఫార్మాట్లో 700 వికెట్ల మార్క్‌ను అందుకునే మొదటి పేసర్ కూడా తానే అవుతానని ధీమా వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్. మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన చివరి టెస్టులో కెప్టెన్ అజార్ అలీని ఔట్ చేసిన అండర్సన్.. 600 వికెట్లు పడగొట్టిన మార్క్‌ను చేరుకున్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన నాలుగో బౌలర్‌గా ఉన్నాడు.