తెలంగాణ

telangana

ETV Bharat / sports

'స్పిరిట్​ ఆఫ్​ క్రికెట్' జ్ఞాపకాన్ని షేర్​ చేసిన ఐసీసీ

ఇంగ్లాండ్​లో 2019 ప్రపంచకప్​ వేదికగా జరిగిన 'స్పిరిట్​ ఆఫ్​ క్రికెట్​' క్షణానికి నేటితో ఏడాది పూర్తయింది. ఆ తీపి జ్ఞాపకాన్ని తాజాగా ట్వీట్​ చేసింది ఐసీసీ. ఆ మ్యాచ్​లో స్మిత్​ను గేలి చేయడానికి బదులుగా చప్పట్లతో ప్రోత్సహించాలని కోహ్లీ అభిమానులను కోరిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

ICC Shares Throwback Video of  'Spirit Of Cricket' From 2019 World Cup
'స్పిరిట్​ ఆఫ్​ క్రికెట్' జ్ఞాపకాన్ని షేర్​ చేసిన ఐసీసీ

By

Published : Jun 9, 2020, 6:00 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, ఆసీస్​ మాజీ కెప్టెన్​ స్టీవ్​ స్మిత్​లు ఆట​లో ఒకరికొకరు పోటాపోటీగా నిలిచినా.. మైదానంలో మాత్రం అసలైన క్రికెట్​ స్పిరిట్​ను చూపారు. గతేడాది ప్రపంచకప్​లో ఇదే రోజున జరిగిన అపురూపమైన క్షణాన్ని తాజాగా ట్విట్టర్​లో పంచుకుంది ఐసీసీ. భారత్​, ఆస్ట్రేలియా మధ్య జరిగిన లీగ్​ మ్యాచ్​ 'స్పిరిట్​ ఆఫ్​ క్రికెట్​'గా నిలిచిన ఆ సన్నివేశానికి వేదికైంది.

ఆ మ్యాచ్​లో బౌండరీ లైన్​ వద్ద ఉన్న స్టీవ్​ స్మిత్​ను భారత జట్టు అభిమానులు గేలి చేస్తున్నారు. అది గమనించిన కోహ్లీ, ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉండాలని.. గేలి చేయడానికి బదులు చప్పట్లతో స్మిత్​ను ఉత్సాహాపరచాలని కోరాడు. ఆ సమయంలో కోహ్లీ తనకు మద్దతు ఇవ్వమని అభిమానులను కోరడం చాలా బాగుందని స్మిత్​ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

2019 ప్రపంచకప్​ లీగ్​ దశలో వరుస విజయాలతో సెమీస్​కు దూసుకుపోయిన భారత్​.. న్యూజిలాండ్​తో జరిగిన పోరులో ఓటమిని చవిచూసింది. టోర్నీలో 'స్పిరిట్​ ఆఫ్​ క్రికెట్​' అవార్డును కోహ్లీ అందుకున్నాడు.

ఇదీ చూడండి... టీ20 ప్రపంచకప్​ భవితవ్యం తేలేది రేపే!

ABOUT THE AUTHOR

...view details