తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్​: 3 ఫార్మాట్లలోనూ టాప్​-5లో కోహ్లీ - విరాట్ కోహ్లీ

ఐసీసీ టీ20, వన్డే ర్యాంకింగ్స్​ను ప్రకటించింది. పొట్టి ఫార్మాట్​లో ఇంగ్లాండ్​తో సిరీస్​లో రెండు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్న టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ -5లో ఉన్నాడు. వన్డేల్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ టాప్-5లో ఉన్న ఏకైక భారత ఆటగాడు విరాట్ కోహ్లీనే.

ICC Rankings: Virat Kohli rises to 5th in T20I list, only batsman in top 5 across formats
ఐసీసీ ర్యాంకింగ్స్​: మూడు ఫార్మాట్లలోనూ టాప్​-5లో కోహ్లీ

By

Published : Mar 17, 2021, 3:29 PM IST

ఐసీసీ టీ20, వన్డేల ర్యాంకింగ్​లను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇంగ్లాండ్​తో ప్రస్తుత పొట్టి సిరీస్​లో రెండు అర్ధ సెంచరీలతో రాణించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని టాప్​-5లోకి దూసుకొచ్చాడు. మూడు ఫార్మాట్లలోనూ టాప్-5లో ఉన్న ఏకైక భారత ఆటగాడు విరాట్ కోహ్లీనే.

కేఎల్​ రాహుల్​ ఒక స్థానాన్ని కోల్పోయి నాల్గో స్థానానికి చేరాడు.​ టీ20 విభాగంలో ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్ డేవిడ్ మలన్ 894 పాయింట్లతో​ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అద్భుత హాఫ్​ సెంచరీతో ఇంగ్లాండ్​కు విజయాన్ని అందించిన జోస్​ బట్లర్​.. తిరిగి టాప్​-20లో స్థానం పొందాడు. ప్రస్తుతం 19వ స్థానంలో ఉన్నాడు.

భారత ఆటగాడు శ్రేయస్​ అయ్యర్ (32 స్థానాలు మెరుగుపరుచుని 31వ ర్యాంకు), రిషభ్ పంత్​ (30 స్థానాలు మెరుగుపరుచుకుని 80వ ర్యాంకు) బౌలర్ శార్దూల్​ ఠాకూర్ (14 స్థానాలు మెరుగుపరుచుకుని 27వ ర్యాంకు) వారి స్థానాలను మెరుగుపరుచుకున్నారు. ఇంగ్లిష్ బ్యాట్స్​మెన్ బెయిర్​ స్టో 14, జేసన్ రాయ్​ 24 ర్యాంకులను దక్కించుకున్నారు.

ఇంగ్లాండ్ ఫాస్ట్​ బౌలర్ జోఫ్రా ఆర్చర్​ 43 స్థానాలు మెరుగయ్యాడు. ప్రస్తుతం 34వ ర్యాంకులో ఉన్నాడు. మరో ఇంగ్లిష్ బౌలర్ మార్క్​ఉడ్ ఏకంగా 59 స్థానాలను మెరుగుపరుచుకుని 39వ ర్యాంకులోకి దూసుకొచ్చాడు.

వన్డే విభాగంలో తొలి రెండు స్థానాలలో టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. శ్రీలంకతో సిరీస్​లో అద్భుతంగా రాణించిన విండీస్​ క్రికెటర్​ షై హోప్​ ఐదు స్థానాలు మెరుగయ్యాడు. ప్రస్తుతం 8వ ర్యాంకును పొందాడు.

ఇదీ చదవండి:పంత్ వల్లే డీఆర్​ఎస్​లు విఫలం: అశ్విన్

ABOUT THE AUTHOR

...view details