తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్​: వన్డేల్లో 11వ స్థానానికి భువనేశ్వర్​

ఐసీసీ.. వన్డే, టీ20లకు సంబంధించి ర్యాంకింగ్స్​ ప్రకటించింది. తాజా జాబితాలో టీమ్​ఇండియా బౌలర్​ భువనేశ్వర్​ ఏకంగా తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకుని 11వ ర్యాంకుకు చేరాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్​ ఆల్​రౌండర్ల లిస్టులో రెండో ర్యాంక్​ను దక్కించుకున్నాడు.

ICC Rankings: Bhuvneshwar gains nine slots to reach 11th spot in ODIs
ఐసీసీ ర్యాంకింగ్స్​: వన్డేల్లో 11వ స్థానానికి భువనేశ్వర్​

By

Published : Mar 31, 2021, 3:25 PM IST

ఐసీసీ వన్డే, టీ20లకు సంబంధించిన ర్యాంకింగ్స్​ను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). ఇటీవల ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​లో అత్యుత్తమ ప్రదర్శన చూపిన భారత బౌలర్ భువనేశ్వర్​ కుమార్​ 11వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

తాజా ర్యాంకింగ్స్​లో 9 స్థానాలు మెరుగుపరుచుకున్న భువీ.. 2017 సెప్టెంబర్​ 10 తర్వాత అత్యుత్తమ ర్యాంకు దక్కించుకోవడం ఇదే తొలిసారి. మరో టీమ్ఇండియా బౌలర్​ శార్దుల్ ఠాకుర్​ ఏకంగా 13 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం 80వ ర్యాంకులో ఉన్నాడు.

బ్యాట్స్​మెన్లలో కేఎల్​ రాహుల్ 31 నుంచి 27వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య కెరీర్​లో ఉత్తమ స్థానాన్ని పొందాడు. బ్యాట్స్​మెన్ల జాబితాలో 42వ ర్యాంకును దక్కించుకున్నాడు. రిషభ్​ పంత్​ టాప్-100లో చోటు సంపాదించాడు.

స్టోక్స్​@2..

ఇక భారత్​తో రెండో వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్​ స్టోక్స్​, బెయిర్ స్టో కెరీర్​లో మంచి ర్యాంకులను పొందారు. ఆల్​రౌండర్ల జాబితాలో స్టోక్స్​ రెండో ర్యాంకును చేరుకున్నాడు. బ్యాట్స్​మెన్లలో.. బెయిర్​ స్టో 7వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. బౌలర్ల జాబితాలో మొయిన్ అలీ 46వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

టీ20 ర్యాంకింగ్స్​..

కివీస్ ఆటగాడు కాన్వే కెరీర్​లోనే బెస్ట్ ర్యాంకును పొందాడు. బ్యాట్స్​మెన్ల జాబితాలో 4వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరో న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్​ ఏకంగా 32 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం 26వ ర్యాంకులో ఉన్నాడు. కివీస్ బౌలర్ టిమ్​ సౌథీ 7వ ర్యాంకును దక్కించుకున్నాడు.

ఇదీ చదవండి:పంత్​కు కెప్టెన్సీపై రైనా ట్వీట్.. పాంటింగ్ స్పందన

ABOUT THE AUTHOR

...view details