తెలంగాణ

telangana

ETV Bharat / sports

"భద్రత కల్పిస్తాం" - scotland

దుబాయిలో జరిగిన ఐసీసీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రికెటర్లకు భద్రత కల్పించే అంశంపై చర్చించారు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్

By

Published : Mar 3, 2019, 12:16 AM IST

దుబాయిలో ఆరు రోజులుగా జరుగుతున్న ఐసీసీ సమావేశాలు ముగిశాయి. పుల్వామా దాడి తర్వాత బీసీసీఐ లేవనెత్తిన ఆటగాళ్ల భద్రత అంశంపై ఐసీసీ స్పందించింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్రికెటర్లకు పటిష్ఠ బందోబస్తును కల్పిస్తామని హామీ ఇచ్చింది.

కుంబ్లే మరోసారి..

టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్ కమిటీ ఛైర్మన్​గా మరోసారి ఎంపికయ్యాడు. మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నాడు.

టీ-ట్వంటీ క్వాలిఫయర్లు ఇక్కడే

పురుషుల టీ-ట్వంటీ ప్రపంచ కప్​ క్వాలిఫయర్​ మ్యాచ్​లు ఈ ఏడాది అక్టోబరు 11 నుంచి నవంబరు 3వరకు యూఏఈలో జరగనున్నాయి.
మహిళా టీ-ట్వంటీ ప్రపంచకప్ క్వాలిఫయర్లు ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 7 వరకు జరగనున్నాయి. ఈ మ్యాచ్​లకు స్కాట్​లాండ్​ అతిథ్యమివ్వనుంది.

ప్రపంచకప్​లో క్రికెటర్ల భద్రతపై ఈసీబీతో కలిసి పటిష్ఠ ప్రణాళికలు రూపొందించాం. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు లేవనెత్తిన భద్రత అంశంపై ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. ---డేవ్ రిచర్డ్​సన్, ఐసీసీ సీఈఓ

ABOUT THE AUTHOR

...view details