తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అప్పుడు ప్రపంచకప్​ హీరో.. ఇప్పుడు నిజమైన హీరో' - covid-19 latest news

లాక్​డౌన్ పరిస్థితుల్లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ ఫొటోను ట్వీట్ చేసింది ఐసీసీ. అతడు రియల్ హీరో అంటూ రాసుకొచ్చింది.

'అప్పుడు ప్రపంచకప్​ హీరో.. ఇప్పుడు నిజమైన హీరో'
జోగిందర్ శర్మ

By

Published : Mar 29, 2020, 2:37 PM IST

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. 2007 టీ20 ప్రపంచకప్​ హీరో, టీమిండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న అతడి ఫొటోను ట్వీట్ చేసి, రియల్ హీరో అంటూ రాసుకొచ్చింది.

జోగిందర్ శర్మ గురించి ఐసీసీ ట్వీట్

2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో చివరి ఓవర్​ వేసి, పాకిస్థాన్​ను కట్టడి చేశాడు జోగిందర్. భారత్​కు చిరస్మరణీయ విజయాన్ని అందించి, కప్పు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత క్రికెట్​​లో ఎక్కువ కాలం కొనసాగని ఇతడు.. హర్యానాలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం దేశంలోని లాక్​డౌన్ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ, బయట ఎవరూ తిరగకుండా కాపలా కాస్తున్నాడు.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది కరోనా వల్ల మరణించగా, దాదాపు 6.50 లక్షల మంది ఈ వైరస్​ బారిన పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details