తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముచ్చటగా మూడోసారి ఐసీసీ గద భారత్​దే

ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ గద​ను వరుసగా మూడో ఏడాది నిలుపుకుంది టీమిండియా. సోమవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్​లో అగ్రస్థానాన్ని పదిలపరచుకుంది.

విరట్ కోహ్లి

By

Published : Apr 1, 2019, 5:13 PM IST

టీమిండియా వరుసగా మూడో ఏడాది టెస్టు ర్యాంకింగ్స్​లో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఫలితంగా.. టెస్టు ఛాంపియన్​షిప్​ గదను వరుసగా మూడోసారి గెల్చుకుంది. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ నెగ్గిన కోహ్లీసేన.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్​లో తొలిస్థానాన్ని పదిలపరచుకుంది. న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది.

గద చేపట్టిన కోహ్లి

"వరుసగా మూడో ఏడాది ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ నిలుపుకోవడం గర్వంగా ఉంది. మా జట్టు అన్ని ఫార్మాట్​లలో రాణించినా.. టెస్టుల్లో మొదటి స్థానంలో ఉండటమనేది ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది"-- విరాట్ కోహ్లీ

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​లో మొదటి ర్యాంకులో నిలిచిన టీమిండియా ఒక మిలియన్ డాలర్లు గెలుచుకుంది. వచ్చే ఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ కల్లా తాము మరింత మెరుగవడానికి కృషి చేస్తామని సారథి విరాట్ అన్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2021లో జరగనుంది. 27 టెస్టు సిరీస్​లలో 71 మ్యాచ్​ల ప్రదర్శనను బట్టి ఫైనల్​కు అర్హత సాధిస్తాయి జట్లు. టెస్టు అర్హత ఉన్న 9 దేశాలు ఇందులో పాల్గొననున్నాయి.

ABOUT THE AUTHOR

...view details