అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఐసీసీ శుభవార్త చెప్పింది. రానున్న కాలంలో ఐసీసీ మహిళ క్రికెట్ టోర్నీల్లో టీమ్‌ల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం మహిళల టీ20 ప్రపంచ కప్‌లో 10 టీమ్‌లు పాల్గొంటున్నాయి. 2026 నుంచి ఈ సంఖ్యను 12కు పెంచనున్నారు. వన్డే వరల్డ్ కప్‌లో ప్రస్తుతం 8 జట్లు కొనసాగుతుండగా.. 2029 సీజన్ నుంచి 10కి పెంచుతామని ఐసీసీ స్పష్టం చేసింది. 2024 టీ20 వరల్డ్ కప్‌తో పాటు రానున్న రెండు వన్డే ప్రపంచ కప్‌లకు పాత పద్దతినే కొనసాగించనున్నట్లు వెల్లడించింది.
గత నాలుగేళ్లుగా మహిళా క్రికెట్‌కూ ఆదరణ పెరుగుతోంది. మ్యాచ్‌లు చూసే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2020లో జరిగిన మహిళా టీ20 ప్రపంచ కప్‌యే అందుకు ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రేక్షకులు ఈ టోర్నీ మ్యాచ్‌లను వీక్షించారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు.. అత్యధికంగా 86వేల పైచిలుకు అభిమానులు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు వచ్చారు.