తెలంగాణ

telangana

ETV Bharat / sports

కృనాల్​ పాండ్యలో ఉన్న రెండో కోణమేంటో తెలుసా? - krunal pandya news

భారత క్రికెటర్​ కృనాల్​ పాండ్య సతీమణి పంఖూరి శర్మ.. అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. తనకు ప్రేమను వ్యక్త పరచిన క్షణాన్ని ఇప్పటికి మర్చిపోలేదంటోంది. ​కృనాల్​ జీవితంలో చేసిన రొమాంటిక్ పని అదేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

'I was shocked' Pankhuri Sharma recalls Krunal Pandya proposing her after IPL 2017 final in front of whole MI team
కృనాల్​ పాండ్యలో ఉన్న రెండో కోణమేంటో తెలుసా!

By

Published : Apr 13, 2020, 6:51 AM IST

టీమ్​ఇండియా క్రికెటర్​ కృనాల్​ పాండ్యలోనూ ఓ రొమాంటిక్​ ప్రేమికుడు దాగున్నాడంటోంది అతని భార్య పంఖూరి శర్మ. కృనాల్​ ప్రపోజ్​ చేసినప్పటి సంఘటన ఇప్పటికీ గుర్తుందని తాజాగా ఓ ముఖాముఖిలో తెలిపింది.

ఐపీఎల్​ 2017 సీజన్​లో ముంబయి ఇండియన్స్​, రైజింగ్​ పుణె సూపర్​జైంట్​ జట్ల మధ్య ఫైనల్​ జరిగింది. అందులో ముంబయి ఘనవిజయం సాధించగా.. 47 పరుగులు సాధించి జట్టు విజయంలో భాగమైన కృనాల్​ పాండ్యకు 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​' అవార్డు లభించింది. ఆ సందర్భంలో ఆటగాళ్ల ముందే తనను పెళ్లి చేసుకో అంటూ ప్రపోజ్​ చేశాడని తెలిపింది అతని భార్య పంఖూరి శర్మ.

"కృనాల్​ నాకు ఎలా ప్రపోజ్​ చేశాడో ఇప్పటికీ గుర్తుంది. 2017 ఐపీఎల్​ ఫైనల్ విజయం​ తర్వాత కృనాల్​ గదిలో నేను, హార్దిక్​ వేచి ఉన్నాం. అంతలోనే కృనాల్​ పాట పాడుకుంటూ గదిలోకి వచ్చాడు. అతడితో పాటు కొంతమంది ముంబయి ఆటగాళ్లు వచ్చారు. వెంటనే నన్ను నిల్చోమని చెప్పి పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నా జీవితంలో మర్చిపోలేని సన్నివేశమది."

-- పంఖూరి శర్మ, కృనాల్​ పాండ్య భార్య

కృనాల్​ పాండ్య, పంఖూరి శర్మ

ఈ విషయం గురించి కృనాల్​ను ప్రశ్నించగా.. పంఖూరి పెళ్లికి అంగీకరిస్తుందనే నమ్మకంతోనే తన ప్రేమను వ్యక్తపరిచానని అన్నాడు. ఆ ఏడాది డిసెంబరు 27న వారిద్దరూ వివాహం చేసుకున్నారు.

ఇదీ చూడండి.. 'నా కెరీర్​లో బాగా ఇబ్బంది పెట్టిన గాయమదే!'

ABOUT THE AUTHOR

...view details