టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారాను సరదాగా ఆటపట్టించాడు. 2018-19 ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లోని ఓ ఫొటోను ట్వీట్ చేసిన కోహ్లీ.. ఫన్నీ కామెంట్‌ను జోడించాడు. "లాక్డౌన్ ఎత్తివేయగానే జట్టు తొలి ప్రాక్టీస్టు సెషన్‌కు సిద్ధంగా ఉండు.. ఈసారి నువ్వు బంతిని ఇలానే పట్టుకుంటావని ఆశిస్తున్నాను" అంటూ రాసుకొచ్చాడు.
పుజారాను ఆటపట్టించిన కెప్టెన్ కోహ్లీ - థ్రోబ్యాక్ ఫొటో చేసిన కోహ్లీ
లాక్డౌన్ తర్వాత ప్రాక్టీసు సెషన్లో, ఇలానే పరుగెత్తాల్సి ఉంటుందని పుజారాను ఆటపట్టించాడు కెప్టెన్ కోహ్లీ. అందుకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫొటోను ట్వీట్ చేశాడు.
పూజారాను థ్రోబ్యాక్ ఫొటోతో ఆటపట్టించిన కోహ్లీ
దీనికి స్పందించిన బౌలర్ షమి.. అవకాశమే లేదని అంటూ హాస్యభరిత కామెంట్ పెట్టాడు. ఈ ఫొటోలో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో కోహ్లీ బంతిని అందుకోగా.. పక్కనే ఉన్న పుజారా విరాట్‌ను చూస్తూ ఉంటాడు.
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. పలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ, అభిమానులతో అలరిస్తున్నారు.