మహిళా టీ20 ప్రపంచకప్‌లో భారత్ రెండు వరుస విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ మెగాటోర్నీలో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ బ్యాటింగ్ మెరుపులు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. సోమవారం బంగ్లాపై 17 బంతుల్లో 39 పరుగులు సాధించి మరోసారి సత్తాచాటింది షెఫాలీ. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ వరల్డ్‌కప్ విజేతగా నిలిచేవరకు ఇలా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూనే ఉంటానని తెలిపింది.
"స్మృతి మంధాన జట్టులో లేని కారణంగా ఎంతో బాధ్యతాయుతంగా ఆడి భారత్‌కు శుభారంభం అందించాలనుకున్నాను. భారీ షాట్లు ఆడటం కోసం బంతిని బలంగా బాదుతూ ప్రాక్టీస్ చేశాను. జట్టుకు మరిన్ని విజయాలు అందించడమే నా లక్ష్యం. భారత్ ప్రపంచకప్‌ను అందుకునే వరకు నా మెరుపు ఇన్నింగ్స్‌లను ఇలానే కొనసాగిస్తా."