తెలంగాణ

telangana

ETV Bharat / sports

విమర్శలు పట్టించుకోను:ధావన్ - pant

నాలుగో వన్డేలో శతకం సాధించి జట్టుకు భారీ స్కోర్ అందించిన ధావన్ విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశాడు. తనపై వచ్చే పత్రికా కథనాల గురించి పెద్దగా పట్టించుకోనని ధావన్ తెలిపాడు.

శిఖర్ ధావన్

By

Published : Mar 11, 2019, 4:08 PM IST

విమర్శలను పట్టించుకోనని భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు. నాకంటూ ఓ ప్రపంచం ఉంది.. అందులోనే జీవిస్తా అంటూ విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాడు.

"నేను పేపర్లు చదవను.. అనవసరమైన విషయాల జోలికిపోను. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియదు. అందువల్ల ఆలోచనలు ఎటు పోతున్నాయో తెలిసిపోతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏకాగ్రతతో ఉండండి. ప్రశాంతంగా ఉన్నప్పుడే బాగుంటా. బాధగా అనిపించినపుడు అక్కడే ఆగిపోకూడదు. ఎవరు నా గురించి ఏం రాస్తున్నారో పట్టించుకోను".
ధావన్, భారత క్రికెటర్

నెగిటివ్ ఆలోచనల్ని దూరం పెడితే అన్నీ బాగుంటాయ్ అంటున్నాడీ డాషింగ్ ఓపెనర్. నాలుగో వన్డేలో పంత్ స్టంపౌట్ వదిలేయడం చూస్తే ధోని లేని లోటు తెలుస్తుంది కదా అన్న ప్రశ్నకు.. ధోనీ భాయ్ ఎన్నో సంవత్సరాలుగా ఆడుతున్నాడు.. అపారమైన అనుభవం మహీ సొంతం అని తెలిపాడు. పంత్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు... రిషభ్​కు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్​లు ఆడే అవకాశం కల్పించడం ఉత్తమమని పేర్కొన్నాడు. వీరిద్దరిని కలిపి పోల్చలేమని స్పష్టం చేశాడు.

ఆరు నెలలుగా శతకం లేకుండా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న ధావన్ మొహాలీ వన్డేలో 143 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోర్ అందించిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details