2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సిక్సుల జోరు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ బాదిన ఆరు సిక్సులు ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉంటాయి. అయితే ఈ సిక్సుల వరద ముందు ఆ జట్టు ఆటగాడు ఫ్లింటాఫ్‌తో వాగ్వాదం జరిగింది. తాజాగా ఆ గొడవ గురించి చెప్పుకొచ్చాడు యువీ.
"ఫ్రెడ్డీ(ఫ్లింటాఫ్) వరుసగా రెండు మంచి బంతులు వేశాడు. ఆ తర్వాత వేసిన యార్కర్‌ను బౌండరీ పంపించా. అప్పుడు అతను నా దగ్గరకు వచ్చి అవి డాష్ షాట్స్ అని అవహేళనగా మాట్లాడాడు. 'నేను నీ గొంతు కోస్తా' అన్నాడు. అపుడు నేను 'నా చేతిలో బ్యాట్ చూశావా. ఈ బ్యాట్‌తో నిన్ను ఎక్కడ కొడతానో తెలుసా?. అన్నాను. అపుడు నేను చాలా కోపంగా ఉన్నా. తర్వాత ఓవర్‌లోనే నేను బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదా. సిక్సర్ల తర్వాత దిమిత్ మస్కరెనాస్ వైపు చూసి, అప్పుడు ఫ్లింటాఫ్ వైపూ చూశా. దిమిత్ను ముందుగా చూడటానికి కారణం అతడు ఓ వన్డే మ్యాచ్‌లో నా బౌలింగ్‌లో ఐదు సిక్సులు కొట్టడమే. "