టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. తనకు ఐదేళ్లుగా వచ్చిన ఓ కలను నిజం చేశాడని చెప్పాడు యువ క్రికెటర్ సంజూ శాంసన్. చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా నిర్వహించిన లైవ్‌చాట్‌లో పాల్గొన్న సంజూ.. ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ వీడియోను సీఎస్క్ ట్వీట్ చేసింది.
"19 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నా. అప్పుడు అతడితో తొలిసారి మాట్లాడా. ఆ తర్వాత ఐదేళ్ల పాటు జట్టులో చోటు దక్కలేదు. అన్ని రోజులు రాత్రుళ్లు ఒకే కల వచ్చేది. వికెట్ల వెనకుండి మహీ భాయ్.. ఫీల్డింగ్ మారుస్తుంటాడు. స్లిప్‌లో ఉన్న నన్ను, అటు వెళ్లు అని అనగానే పరిగెత్తుకువెళ్లేవాడిని" -సంజూ శాంసన్, భారత యువ క్రికెటర్