తెలంగాణ

telangana

ETV Bharat / sports

'స్పిన్​ బౌలింగ్​ ఎదుర్కొంటేనే విజయం' - cricket

స్పిన్ విభాగం రాణిస్తేనే ఆసీస్​కు గెలిచే అవకాశాలు ఉంటాయని ఆ జట్టు మాజీ సారథి పాంటింగ్ తెలిపాడు. స్మిత్, వార్నర్ రాకతో జట్టుకు బలం చేకూరిందని అన్నాడు.

పాంటింగ్

By

Published : May 23, 2019, 1:00 PM IST

ప్రపంచకప్​లో ఆస్ట్రేలియా గెలుపు స్పిన్​పై ఆధారపడి ఉందని అంటున్నాడు ఆ జట్టు మాజీ సారథి పాంటింగ్. మిడిలార్డర్​లో స్పిన్ బౌలింగ్​ను ఎదుర్కోవడంపై దృష్టిసారించాలని.. స్మిత్, వార్నర్ రాకతో జట్టు బలంగా తయారైందని తెలిపాడు.

స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేస్తేనే ఆసీస్ విజయం సాధించగలదని పాంటింగ్ విశ్లేషించాడు. 12 నుంచి 18 నెలలుగా స్పిన్నర్లు ఆడం జంపా, నాథన్ లియోన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నాడు.

"స్మిత్, వార్నర్ రాకతో ఆసీస్ బలపడింది. వారిద్దరూ స్పిన్ బౌలింగ్​నూ చాలా బాగా ఎదుర్కోగలరు. ఐపీఎల్​లో పాంటింగ్​ అద్భుతంగా రాణించాడు. వీరిద్దరూ చాలా ప్రతిభావంతులు".
-రికీ పాంటింగ్, ఆసీస్ జట్టు మాజీ సారథి

స్మిత్, వార్నర్ బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరమయ్యారు. ఐపీఎల్​లో పునరాగమనం చేసి వార్నర్ సత్తాచాటగా.. స్మిత్ ఫర్వాలేదనిపించాడు. 12 మ్యాచ్​లాడిన వార్నర్ 692 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. స్మిత్ 12 మ్యాచ్​ల్లో 319 పరుగులు చేశాడు.
ఇవీ చూడండి.. ధోనీ ఐదో స్థానంలోనే రావాలి: సచిన్

ABOUT THE AUTHOR

...view details