తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎస్పీ బాలు మృతిపై క్రీడాలోకం దిగ్భ్రాంతి - ఎస్పీ బాలు తాజా వార్తలు

ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు మృతిపై క్రీడాలోకం దిగ్భ్రాంతి చెందింది. రాబోయే తరాలకు ఆ గొంతుక ఓ స్ఫూర్తి అని అన్నారు.

ఎస్పీ బాలు మృతిపై క్రీడాలోకం దిగ్భ్రాంతి
Sports fraternity mourns death of SP Balasubrahmanyam

By

Published : Sep 25, 2020, 7:04 PM IST

ప్రముఖ గాయకుడు‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల యావత్‌ దేశం దిగ్ర్భాంతికి లోనైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లు సైతం ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా ఎస్పీబీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

  1. గాన గంధర్వుడు కన్నుమూశారనే వార్త తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయన గొంతుక రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం. ఎస్పీబీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి. -సురేశ్‌ రైనా
  2. బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. మనందరికీ ఆయన ఎన్నో ఆణిముత్యాలను వదిలి వెళ్లారు. -హర్షాభోగ్లే
  3. ఎస్పీబీ ఇక లేరని తెలిసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన పాటలెప్పుడూ మన హృదయాల్లో నిలిచిపోతాయి. ఓం శాంతి. -వీవీఎస్‌ లక్ష్మణ్‌
  4. దేవుడా.. ఈ ఏడాది.. రోజూ దారుణంగా మారుతోంది. ఎస్పీబీ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. -రవిచంద్రన్‌ అశ్విన్‌
  5. అతిగొప్ప గాయకుల్లో ఒకరైన బాలసుబ్రహ్మణ్యం గారి మధుర స్వరం మనందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన లోటు పూడ్చలేనిది. కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. -గౌతమ్‌ గంభీర్‌
  6. పాట రూపంలో మీరు ఎప్పుడూ బతికే ఉంటారు సార్‌. -సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

ABOUT THE AUTHOR

...view details