తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్ ఆసిస్ జట్టులో వార్నర్, స్మిత్ - warner

త్వరలో ప్రారంభంకాబోయే క్రికెట్ ప్రపంచకప్​కు ఆస్ట్రేలియా.. 15 మందితో జట్టును ప్రకటించింది. ఏడాది నిషేధం తర్వాత స్మిత్, వార్నర్ ఆ దేశం తరఫున ఆడనున్నారు.

ఆస్ట్రేలియా

By

Published : Apr 15, 2019, 10:21 AM IST

ప్రపంచకప్​లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టు ప్రకటించింది ఆసిస్ క్రికెట్ బోర్డు. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరమైన స్టీవ్ స్మిత్, వార్నర్ జట్టులోకి పునరాగమనం చేశారు.

భారత్, పాకిస్థాన్ సిరీస్​లో జట్టుకు విజయాలందించిన ఫించ్​కు ప్రపంచకప్ సారథ్య బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. భారత పర్యటనలో రాణించిన హ్యాండ్స్ కాంబ్, పేసర్ హెజిల్ వుడ్​లకు నిరాశే ఎదురైంది. ఖవాజా, షాన్ మార్ష్ చోటు దక్కించుకున్నారు. ఆల్ రౌండర్ల విభాగంలో స్టాయినిస్, మాక్స్​వెల్​ను ఎంపిక చేశారు. బౌలర్లలో కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, రిచర్డ్‌ సన్‌, నాథన్‌ కౌల్టర్ నీల్, బెహ్రెండార్ఫ్‌ను జట్టులోకి తీసుకున్నారు. జంపా, లైయన్ స్పిన్ కోటాను పంచుకోనున్నారు.

ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌లో జూన్‌ 1న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), బెహ్రెండార్ఫ్‌, అలెక్స్‌ కారే (కీపర్‌), కౌల్టర్‌నీల్‌, కమిన్స్‌, ఉస్మాన్‌ ఖవాజా, నాథన్‌ లైయన్‌, షాన్‌ మార్ష్‌, మాక్స్‌వెల్‌, రిచర్డ్‌సన్‌, స్టార్క్‌, స్టాయినిస్‌, వార్నర్‌, స్టీవెన్‌ స్మిత్‌, ఆడమ్‌ జంపా

ఇవీ చూడండి.. ఐపీఎల్​లో సురేష్ రైనా మరో రికార్డు

ABOUT THE AUTHOR

...view details