తెలంగాణ

telangana

ETV Bharat / sports

'హెలికాప్టర్ షాట్​ కోసం అంతలా కష్టపడ్డాడు' - Sushant Singh Rajput perfected the helicopter shot

సుశాంత్​కు ధోనీ పాత్రపై ఉన్న ఆసక్తి గురించి చెప్పిన నిర్మాత అరుణ్ పాండే.. 'ఎం.ఎస్.ధోని' బయోపిక్​లోని హెలికాప్టర్​ షాట్​ కోసం అతడు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్నారు.

'హెలికాప్టర్ షాట్​ కోసం అంతలా కష్టపడ్డాడు'
సుశాంత్ సింగ్ రాజ్​పుత్

By

Published : Jun 15, 2020, 7:01 AM IST

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య సినీ ప్రియుల్నే కాదు.. క్రీడా ప్రేమికుల్ని తీవ్రంగా కలచివేసింది. 'ఎం.ఎస్‌.ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమాలో ధోనీ పాత్రను అద్భుతంగా పోషించిన అతడు క్రికెట్‌ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాడు. తమ ఆరాధ్య క్రికెటర్‌ జీవిత కథలో సుశాంత్‌ ఒదిగిపోయిన తీరుకు ముగ్ధులైపోయారు. ఈ చిత్రం చూశాక ధోనీ అభిమానులందరూ అతడికీ అభిమానులుగా మారిపోయారు. సినిమాలో ధోనీలా కనిపించడం కోసం సుశాంత్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదంటున్నాడు మహీ స్నేహితుడు, 'ఎం.ఎస్‌.ధోని' సహ నిర్మాత అరుణ్‌ పాండే.

"తాను ధోనీగా మెప్పించలేకపోతే కోట్లాది మంది ధోనీ అభిమానులు తనను క్షమించరని సుశాంత్‌ అంటుండేవాడు. అందుకే ఆ పాత్ర కోసం విపరీతంగా శ్రమించాడు. ఓ రోజు హెలికాఫ్టర్‌ షాట్‌ సాధన చేస్తుండగా.. కండరాలు పట్టేశాయి. అతడు విశ్రాంతి తీసుకుంటాడని అనుకున్నాం. కానీ తన వల్ల షూటింగ్‌ ఆలస్యం కాకూడదని.. నొప్పితోనే సాధన కొనసాగించాడు. వారం రోజుల పాటు ఆ షాట్‌ను ప్రాక్టీస్‌ చేసి పట్టు సాధించాడు. ధోనీలా మారే క్రమంలో తన పాత ఇంటికి వెళ్లి అతను పడుకున్న చోటే నేల మీద పడుకుని నిద్రపోయాడు" అని పాండే చెప్పారు.

మరోవైపు సచిన్‌, కోహ్లీ, రోహిత్‌ సహా భారత క్రికెటర్లు, ఇతర క్రీడల ప్రముఖులు సుశాంత్‌ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details