అండర్-19 కోచ్‌గా ఉంటున్న రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ మరో పెద్ద బాధ్యతను అప్పగించింది. బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్‌గా ద్రవిడ్‌ను నియమించింది. రాహుల్ ఆ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నాడు. జులై 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నాడు ఈ క్రికెట్ దిగ్గజం.
ప్రతిభావంతులైన జూనియర్ స్థాయి క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడంతో పాటు మహిళా క్రికెట్ వ్యవహారాలనూ చూసుకోనున్నాడు రాహుల్. ఎన్సీఏ, జోనల్ క్రికెట్ అకాడమీ కోచింగ్ స్టాఫ్ తదితర బాధ్యతలను నిర్వర్తించనున్నాడు ద్రవిడ్.