టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యల మధ్య ఫిట్నెస్ ఛాలెంజ్ నడుస్తోంది. తాజాగా మరోసారి ప్రమాదకర ఎక్సర్సైజ్ చేయమని విరాట్‌కు సవాలు విసిరాడు హార్దిక్. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు.
కొన్నిరోజుల క్రితం గాల్లోకి ఎగిరి 'పుష్ అప్స్' చేసిన వీడియోను హార్దిక్ పంచుకోగా.. విరాట్ దానికి చప్పట్లు జతచేసి మరో వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్పుడు పాండ్య గాల్లోకి ఎగిరి వీపు వెనుక చప్పట్లు కొడుతూ చేసిన ఎక్సర్సైజ్ను ట్వీట్ చేశాడు. దీనిని చేయమని కోహ్లీకి సవాలు విసిరాడు.