భారత్ ఆడే తొలి డే అండ్ నైట్ టెస్టు గురించి టీమిండియా సీనియర్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్ మాట్లాడారు. ఈ మ్యాచ్‌లో ఉపయోగించే గులాబి బంతి.. మణికట్టు స్పిన్నర్లకు కలిసొస్తుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
"గులాబి బంతి సీమ్‌ను బ్యాట్స్‌మెన్ పసిగట్టడం కష్టం. మణికట్టు స్పిన్నర్లకిది సానుకూలాంశం. ఆఫ్ స్పిన్నర్లతో పోలిస్తే వాళ్ల బంతుల్ని అంచనా వేయడం ఇబ్బందే. దులీప్ ట్రోఫీ సందర్భంగా గులాబి బంతితో మ్యాచ్ ఆడినపుడు మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్ బౌలింగ్‌ను అంచనా వేయడం బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టమైంది. డే/నైట్ టెస్టులో సాయంత్రం 3.30 -4.30 మధ్య పిచ్.. పేసర్లు అనుకూలిస్తుంది" -హర్భజన్ సింగ్, టీమిండియా సీనియర్ క్రికెటర్.
టీమిండియా బౌలింగ్‌కు రెండు వైపులా పదునుందని గౌతమ్ గంభీర్ అన్నాడు.