ఐపీఎల్-2020 వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన 10 మంది ఆటగాళ్లలో ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒకడు. రూ. 10.75 కోట్లతో ఇతడిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు దక్కించుకుంది. అయితే ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చోటు సంపాదించుకున్నాడో లేదో.. అప్పుడే మోత మొదలెట్టేశాడు. శుక్రవారం ప్రత్యర్థి బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో.. 83 పరుగులతో(39 బంతుల్లో; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో దాదాపు 212.82 స్ట్రయిక్ రేటు నమోదు చేశాడు.
ఐపీఎల్లో భారీ ధర.. అప్పుడే మోత మొదలెట్టేశాడు! - Melbourne Stars
ఐపీఎల్ వేలంలో భారీ జాక్‌పాట్ కొట్టేసిన ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ప్రస్తుతం జోష్ మీదున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున బరిలోకి దిగిన ఈ ఆటగాడు.. 83 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
ఐపీఎల్లో భారీ ధర... అప్పుడే మోత మొదలెట్టేశాడు
ఇటీవలే మళ్లీ బ్యాట్ పట్టాడు...
మానసిక ఆరోగ్య సమస్య కారణంగా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు మ్యాక్స్‌వెల్. అయితే స్వదేశీ, విదేశీ లీగ్‌ల్లో మాత్రం ఆడుతున్నాడీ ఆస్ట్రేలియా క్రికెటర్. ఇందులో భాగంగానే ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.