ధోనీలా ఆడేందుకు ప్రయత్నించకుండా, ఆటలో ప్రతి విషయాన్ని సొంతంగా నేర్చుకోవాలని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సూచించాడు ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్. అంతేకాకుండా భారత అభిమానులు పంత్, ధోనీని ఒకరితో మరొకరిని పోల్చవద్దని అభిప్రాయపడ్డాడు. ఓ సంస్థ ప్రచార కార్యక్రమానికి హాజరైన ఈ ఆసీస్ మాజీ ఆటగాడు... పంత్ గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాజీ క్రికెటర్ "నేను ఎప్పట్నుంచో చెప్తున్నా... ఒకరితో మరొకరిని ఎప్పుడూ పోల్చవద్దు. భారతీయ అభిమానులు పంత్‌ను ధోనీతో పోల్చకూడదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో అంతటి అత్యున్నత స్థాయి ధోనీ అందుకున్నాడు. ఏదో ఒకరోజు ఎవరైనా దాన్ని అందుకోవచ్చేమో కానీ అది అసంభవం"
-- ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాజీ క్రికెటర్
పంత్‌లో ఎనలేని ప్రతిభ:
ప్రపంచకప్ తర్వాత నుంచి ఏ టోర్నీలోనూ సరిగ్గా రాణించలేదని పంత్‌పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ ఆటగాడికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నా సద్వినియోగం చేసుకోట్లేదని పెద్ద చర్చ నడుస్తోంది. అంతేకాకుండా దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తోఆదివారంజరిగిన తొలి టీ20లో డీఆర్ఎస్‌ను అంచనా వేయలేకపోయాడని విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపైనా మాట్లాడాడు గిల్‌క్రిస్ట్.
"రిషబ్ పంత్ ప్రతిభ కలిగిన యువ ఆటగాడు. అప్పుడే అతనిపై ఎక్కువ ఒత్తిడి చేయకూడదు. రాబోయే రోజుల్లో కచ్చితంగా ధోనీ తరహా ప్రదర్శనలు ఇస్తాడని ఆశించండి"
-- ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాజీ క్రికెటర్
ఆ తర్వాత పంత్‌కు విలువైన సూచన ఇచ్చాడు గిల్‌క్రిస్ట్. ధోనీ నుంచి ఏం నేర్చుకున్నా పర్వాలేదు కానీ ఆయన తరహాలోనే ఆడటానికి మాత్రం ప్రయత్నించవద్దని చెప్పాడు. రిషబ్ పంత్ అనే ప్రత్యేక మార్కు ఏర్పరచుకోవాలని సూచించాడు.