తెలంగాణ

telangana

స్మిత్​కు​ కెప్టెన్సీ?.. గిల్​క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆసీస్ బ్యాట్స్​మన్ స్టీవ్​ స్మిత్​కు కెప్టెన్​ ఇచ్చే విషయమై బోర్డు ఆలోచించాలని మాజీ క్రికెటర్ గిల్​క్రిస్ట్ అన్నాడు. ఆ పదవికి అతడే సరైనవాడని అభిప్రాయపడ్డాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ఈనెల 17 నుంచి జరగనుంది.

By

Published : Dec 13, 2020, 4:24 PM IST

Published : Dec 13, 2020, 4:24 PM IST

ETV Bharat / sports

స్మిత్​కు​ కెప్టెన్సీ?.. గిల్​క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gilchrist requests Cricket Australia to make Smith as vice captain of the team
'స్టీవ్​ స్మిత్​ను వైస్​ కెప్టెన్​గా నియమించాలి'

స్టార్ బ్యాట్స్​మన్​ స్టీవ్​ స్మిత్​కు ఆస్ట్రేలియా​ కెప్టెన్సీ ఇచ్చే విషయమై మాజీ క్రికెటర్ ఆడమ్స్ గిల్​క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథ్య బాధ్యతలు అందుకునేందుకు అతడిపై ఉన్న ఆంక్షలు తొలగించాలని అన్నాడు. స్మిత్ ఉప సారథిగా చేయాలని బోర్డుకు సూచించాడు.

"స్టీవ్​ స్మిత్​కు మరోసారి జట్టు బాధ్యతలు ఎందుకు ఇవ్వకూడదు. ఆ పదవిని చేపట్టేందుకు అతడు సరైనవాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకూ స్మిత్​పై ఇలాంటి భావనే ఉంటే అతన్ని వెంటనే వైస్​ కెప్టెన్​ను చేయండి"

-ఆడమ్ గిల్​క్రిస్ట్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

2018లో బాల్​ టాంపరింగ్​ వివాదం వల్ల స్మిత్​, వార్నర్​ ఏడాది పాటు ఆటకు దూరమయ్యారు. కెప్టెన్, వైస్ కెప్టెన్​ పదవుల నుంచీ వైదొలిగారు. ఆ తర్వాత నుంచి టెస్టులకు టిమ్​ పైన్, వైట్​ బాల్ మ్యాచ్​లకు ఫించ్​ సారథులుగా ఉన్నారు.

ఇదీ చదవండి:ప్రభాస్​తో నటించాలని ఆశ పడుతున్న శ్రుతి

ABOUT THE AUTHOR

...view details