తెలంగాణ

telangana

ETV Bharat / sports

మన్కడింగ్ కాదు... బ్రౌన్డ్​: సునీల్ గావస్కర్​ - మన్కడెడ్

మన్కడింగ్​ను బ్రౌన్డ్​గా పిలవాలని సూచించాడు భారత మాజీ ఆటగాడు సునీల్​ గావస్కర్.​ రనౌట్​ను మన్కడింగ్​గా పిలుస్తూ ఓ దిగ్గజ భారత ఆటగాడిని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

మన్కడింగ్ కాదు బ్రౌన్డ్​ అని పిలవండి: గవాస్కర్​

By

Published : Apr 6, 2019, 5:36 PM IST

మన్కడింగ్.. ఎప్పుడో 70ఏళ్ల క్రితం భారత ఆటగాడు వినోద్ మన్కడ్ చేసిన రనౌట్ ఆధారంగా ఇప్పటికీ ఆయన పేరుతోనే మన్కడెడ్ అని పిలుస్తున్నారు. అయితే... క్రీడా స్ఫూర్తి పేరు చెప్పి ఓ దిగ్గజ క్రీడాకారుడిని అవమానిస్తున్నారని భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఓ జర్నలిస్టు మన్కడెడ్ రాసినంత మాత్రాన మన క్రీడాకారుడిని అవమానించాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు.

జాస్ బట్లర్​ను రవిచంద్రన్ అశ్విన్ రనౌట్​ చేసినప్పటి నుంచి మన్కడింగ్​పైనే అందరూ మాట్లాడుతున్నారు.

మన్కడింగ్​పై గావస్కర్ మనోగతం:

"1940ల్లో నాన్​స్ట్రైకింగ్​లో ఉన్న ఆస్ట్రేలియన్ ఆటగాడు బిల్​ బ్రౌన్​ని వినోద్ మన్కడ్​ రనౌట్ చేశాడు. అంతకుముందు రెండుసార్లు వినోద్ హెచ్చరించినా బ్యాట్స్​మన్ వినలేదు. దీంతో క్రీజులో నుంచి బయటకు రాగానే వినోద్.. బ్రౌన్​ని ​రనౌట్​ చేశాడు. అప్పటి నుంచి ఈ విధమైన ఔట్​ను మన్కడింగ్ అని పిలుస్తున్నారు. వినోద్ చేసిందే సరైనదే అని సర్ డాన్ బ్రాడ్​మన్​ లాంటి దిగ్గజాలు చెప్పినా మన్కడింగ్ అనే పేరు అలా పడిపోయింది" అని గావస్కర్ అన్నాడు.

"బంతి బ్యాట్​కు తగిలిందని తెలిసినా క్రీజుని వీడని బ్యాట్స్​మన్​ని డబ్ల్యూజీ అని పిలవట్లేదు. బ్రియన్ లారా కొట్టిన బంతిని స్టీవ్ వా నేలను తాకిన తర్వాత క్యాచ్ అందుకుని ఔట్ అప్పీల్ చేశాడు. ఆ అంశాన్ని స్టీవ్​ వా అని పిలవట్లేదు. అలాంటపుడు క్రీజు దాటి బయటికొచ్చిన నాన్​స్ట్రైకర్ బ్యాట్స్​మెన్​ను రనౌట్ చేయడాన్ని ఎలా తప్పుపడతాం. ఒకవేళ క్రీడాస్ఫూర్తికి అనుగుణంగా ఉండాలనుకుంటే మన్కడింగ్ బదులు బ్రౌన్డ్​(వినోద్ మన్కడ్ చేతిలో రనౌటైన బిల్లీ బ్రౌన్) అనే పేరుతో పిలవాలని" సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details