బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండటం కంటే క్రికెటర్‌గా బాధ్యతలు నిర్వర్తించడమే కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. స్పోర్ట్స్‌స్టార్ ఏసెస్ అవార్డుల కార్యక్రమానికి దాదా హాజరయ్యాడు. 2019 ఉత్తమ టెస్టు జట్టుగా భారత్ ఎంపికైన కారణంగా టీమిండియా తరఫున దాదా ట్రోఫీని అందుకున్నాడు.
"టీమిండియాకు ఉత్తమ టెస్టు జట్టు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ఏడాది మిగిలిన జట్లు కూడా గొప్పగానే ఆడాయి. భారత జట్టుకు, బ్యాటింగ్ కోచ్ విక్రమ్‌కు అభినందనలు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉండటం వల్ల వారు ఇక్కడ లేరు. ఈ కొత్త ఏడాదికి కూడా ఆల్ ది బెస్ట్. 2020లో మెగాటోర్నీలు ఉన్నాయి. అండర్ 19 ప్రపంచకప్, పరుషుల, మహిళల టీ20 ప్రపంచకప్‌ల్లో రాణిస్తారని ఆశిస్తున్నా."
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఒత్తిడిలో ఆడటం కంటే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండటమే తేలికని అన్నాడు గంగూలీ.