ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేస్తున్నామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించాడు. అయితే ఈ టోర్నీని ఏ దేశంలో నిర్వహించాలనుకున్నారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. జులై 9న ఆసియా క్రికెట్ మండలి సమావేశం జరగడానికి ముందే దాదా ఈ విషయం వెల్లడించడం గమనార్హం.
ఆసియా కప్-2020 రద్దు.. గంగూలీ ప్రకటన
సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియాకప్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా సంక్షోభం కారణంగా టోర్నీ రద్దుకు నిర్ణయించామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
కరోనా విజృంభణ కారణంగా అక్టోబరు-నవంబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ జరిగే అవకాశాలు లేకపోవడం వల్ల.. ఆ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించడానికి బీసీసీఐకి వీలుంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై స్పందించిన గంగూలీ.. ఐపీఎల్‌ను ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని స్పష్టం చేశాడు. టోర్నీని పూర్తిగా భారత్‌లో జరిపేందుకే ప్రాధాన్యమని వెల్లడించాడు దాదా.
షెడ్యూలు ప్రకారం ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాలి. దాయాది దేశానికి వెళ్లేందుకు బీసీసీఐ ఇష్టపడకపోవడంతో వేదిక దుబాయ్‌కు మారింది. సెప్టెంబర్‌లో టోర్నీ నిర్వహించాలి. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రద్దైనట్టు తెలుస్తోంది. ఇక ఐసీసీ టీ20 ప్రపంచకప్ సైతం వాయిదా పడితే ఐపీఎల్-2020 నిర్వహించుకొనేందుకు పూర్తిస్థాయి విండో దొరుకుతుంది.