తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బాధపడకు... పీవోకేనూ బాగు చేస్తాం'

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాడు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్​ అఫ్రిదీ. ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే అఫ్రిదీపై తనదైన శైలిలో స్పందించాడు గౌతమ్​ గంభీర్​.

గౌతమ్ గంభీర్​

By

Published : Aug 6, 2019, 5:47 PM IST

Updated : Aug 6, 2019, 6:41 PM IST

జమ్ము, కశ్మీర్​కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ సోమవారం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిదీ వ్యతిరేకించాడు. "కశ్మీర్​ ప్రజలకు అన్ని హక్కులు కల్పించాల్సిందే" అని ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అయితే భారత్ మాజీ క్రికెటర్ గౌతమ్​ గంభీర్.. అఫ్రిదీకి తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చాడు. "పీవోకేనూ సరిచేస్తాం.. కంగారు పడకు" అంటూ బదులిచ్చాడు.

"ఐరాస తీర్మానం ప్రకారం కశ్మీర్ ప్రజలకు అన్ని హక్కులను కల్పించాల్సిందే. మన అందరిలాగే వారికి ప్రాథమిక హక్కులు అందాలి. ఈ విషయంలో ఐరాస ఎందుకు కల్పించుకోవట్లేదో అర్థం కావట్లేదు. మానవత్వానికి వ్యతిరేకంగా కశ్మీర్​లో జరుగుతున్న నేరాలను గుర్తించాలి" -షాహిద్ అఫ్రిదీ, ట్వీట్​

అఫ్రిదీ ట్వీట్​కు గౌతమ్ గంబీర్ తనదైన రీతిలో స్పందించాడు.

"ఈ విషయాన్ని పైకి తెచ్చినందుకు అఫ్రిదీని అభినందించాల్సిందే. అయితే అతడు ఓ అంశాన్ని విస్మరించాడు. ఈ నేరాలన్నీ జరుగుతోంది పాక్ ఆక్రమిత కశ్మీర్​లోనే. బాధ పడకు షాహిద్​.. అక్కడ కూడా సరిచేస్తాం" -గౌతమ్ గంభీర్​ ట్వీట్​.

ఆర్టికల్​ 370ను రద్దు చేస్తూ మోదీ సర్కారు జమ్ము, కశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభిజించింది. ప్రస్తుతం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించగా.. లోక్​సభలో చర్చ జరుగుతోంది.

ఇది చదవండి: పొలార్డ్​కు జరిమానా.. ఓ డీమెరిట్ పాయింట్​

Last Updated : Aug 6, 2019, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details