టెస్టుల నిడివి గురించి ఎటువంటి ఆందోళన లేదని, అయితే ప్రతి మ్యాచ్‌కు ఫలితాలు రావడమే తనకి ముఖ్యమని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియన్ లారా అన్నాడు. 2023-31 మధ్య కొత్త భవిష్యత్ పర్యటనల ప్రణాళికలో ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదన చేసింది. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ విషయమై లారా స్పందించాడు.
"నా దృష్టిలో ఫలితం ఎలా వస్తుందనే అందరూ ఆలోచిస్తారు. ఎందుకంటే ఫలితంపైనే అందరికీ ఆసక్తి ఉంటుంది. టెస్టుల నిడివి నాలుగు రోజులా లేదా అయిదు రోజులా అనేది విషయం కాదు. ప్రతి మ్యాచ్‌కు ఏదో రూపంలో ముగింపు కచ్చితంగా ఉంటుంది. ప్రజలు తొలి రోజు, ఆఖరి రోజుపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కొందరు అయిదు రోజులు క్రికెట్ ఆడాలని భావిస్తారు. అయితే ఆ సందర్భాల్లో కూడా అన్నిసార్లు ఫలితాలు రావు"