టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. చెన్నైలో కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్న కారణంగా నిత్యావసర వస్తువులను ప్రజలంతా 2 కి.మీల లోపే కొనుగోలు చేయాలని ఆదేశించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.
కొబ్బరి బొండం కోసం వెళ్తే.. కారు సీజ్ చేశారు - రాబిన్ సింగ్ లేటెస్ట్ న్యూస్
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నై నగరంలో ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించడమే ఇందుకు కారణం.
కొబ్బరిబొండం కోసం వెళ్తే.. కారు సీజ్ చేశారు
అయితే జూన్ 20న మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్.. కొబ్బరి బొండం కొనడానికి తన కారులో బీసెంట్ రోడ్ నుంచి తిరువన్మయూర్ వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు అతడి కారును సీజ్ చేసి నిబంధనల అతిక్రమణ కింద కేసు నమోదు చేశారు.