తెలంగాణ

telangana

ETV Bharat / sports

యువ క్రికెటర్లపై దృష్టిపెట్టాలి: భారత కోచ్ రవిశాస్త్రి - coach

టీ-20 వరల్డ్​కప్, ప్రపంచ ఛాంపియన్​షిప్​ను దృష్టిలో ఉంచుకుని యువతను ప్రోత్సహించాలని చెప్పాడు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి. మూడు ఫార్మాట్లలో సెకండ్ బెంచ్​ను పటిష్ఠపరచాలని అభిప్రాయపడ్డాడు.

రవిశాస్త్రి

By

Published : Sep 10, 2019, 6:31 AM IST

Updated : Sep 30, 2019, 2:11 AM IST

కోచ్​గా రెండో సారి బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టుకు సంబంధించి కొన్ని కీలక మార్పులపై దృష్టిపెట్టాడు రవిశాస్త్రి. వచ్చే ఏడాది జరుగనున్న టీ-20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపనున్నట్లు చెప్పాడు.

"టీ-20 ప్రపంచకప్​నకు సరిగ్గా ఏడాది మాత్రమే సమయం ఉంది. అనంతరం మరో 6, 7నెలల తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​ జరుగనుంది. ఇలాంటి తరుణంలో యువ ఆటగాళ్లను పైకి తీసుకురావాలనే మార్గం స్పష్టంగా కనిపిస్తోంది" -రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్

మూడు ఫార్మాట్లలోనూ సెకండ్ బెంచ్​ను పటిష్ఠ పరచాలని రవిశాస్త్రి అన్నాడు.

"ప్రస్తుతం జట్టు నిలకడగా ఆడుతోంది. ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగించాలి. అదే విధంగా యువతను ప్రోత్సహించి మూడు ఫార్మాట్లలో సెకండ్ బెంచ్​ను బలంగా తయారు చేయాలి" -రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టెస్టు సిరీస్​లో నెగ్గి ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పాయింట్లు మెరుగుపరచుకోవాలని తెలిపాడు రవిశాస్త్రి. గత మూడేళ్లుగా టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్నామని, ఇలాగే నిలకడగా ఆడి ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో సత్తాచాటాలని చెప్పాడు.

ఇది చదవండి: మన కోచ్​లకు జీతాలు పెరిగినయ్..!

Last Updated : Sep 30, 2019, 2:11 AM IST

ABOUT THE AUTHOR

...view details