తెలంగాణ

telangana

ETV Bharat / sports

పృథ్వీషా ఫిట్.. న్యూజిలాండ్​ టూర్​కు పయనం - India A tour of New Zealand

జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ పూర్తి ఫిట్​నెస్​ సాధించిన పృథ్వీషా.. న్యూజిలాండ్​ పర్యటనకు ఎంపికయ్యాడు. భారత్-ఏ తరఫున మ్యాచ్​లు ఆడనున్నాడు. టెస్టు జట్టులో రిజర్వ్ ఓపెనర్​ స్థానం కోసం పోటీపడుతున్నాడు.

పృథ్వీషా ఫిట్.. న్యూజిలాండ్​ టూర్​కు ఎంపిక
భారత యువ క్రికెటర్ పృథ్వీషా

By

Published : Jan 16, 2020, 7:01 AM IST

గత వారం రంజీ మ్యాచ్​ ఆడుతూ గాయపడ్డ భారత యువ క్రికెటర్ పృథ్వీషా.. పూర్తి ఫిట్​నెస్ సాధించాడు. మరికొద్ది గంటల్లో న్యూజిలాండ్​లో ఉన్న భారత్-ఏ జట్టుతో కలవనున్నాడు. గత కొద్ది కాలం నుంచి బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీలోని పునరావస కేంద్రంలో శిక్షణ పొందుతున్నాడు షా.

"పృథ్వీషా.. గురువారం లేదా శుక్రవారం న్యూజిలాండ్​లో ఉన్న భారత్-ఏ జట్టుతో కలవనున్నాడు. అతడు పూర్తి ఫిట్​నెస్ సాధించాడు" -బీసీసీఐ అధికారి

ఈ మ్యాచ్​ల్లో ఆడి, టీమిండియా టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు షా. అయితే అతడితో పాటే శుభ్​మన్ గిల్.. రిజర్వ్ ఓపెనర్​ స్థానం కోసం పోటీపడుతున్నాడని సెలక్షన్ కమిటీ సభ్యుల్లో ఒకరు చెప్పారు.

వెస్టిండీస్​పై టెస్టు అరంగేట్రం చేసిన పృథ్వీ.. మొదటి మ్యాచ్​లో సెంచరీ, అర్ధశతకం చేశాడు. రెండు టెస్టుల సిరీస్​లో మొత్తంగా 237 పరుగులు సాధించాడు.

ABOUT THE AUTHOR

...view details