తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరుణుడి రాక.. భారత్​-విండీస్​ తొలి వన్డే రద్దు

భారత్​-వెస్టిండీస్​ మధ్య గురువారం జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఆలస్యంగా మ్యాచ్​ ప్రారంభించి.. ఓవర్లు కుదించినప్పటికీ వరుణుడి ప్రతాపం మ్యాచ్​ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అంపైర్లు. రెండో వన్డే పోర్ట్​ ఆఫ్​ స్పెయిన్​ వేదికగా ఆదివారం జరగనుంది.

By

Published : Aug 9, 2019, 5:15 AM IST

వరుణుడి రాక.. భారత్​-విండీస్​ తొలి వన్డే రద్దు

టీమిండియా జట్టు వెస్టిండీస్​ పర్యటనలో.. వరుణుడు ఇబ్బందులు సృష్టిస్తున్నాడు. గయానా వేదికగా ఇరు జట్ల మధ్య గురువారం జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్​ ఆరంభానికి ముందే వర్షంతో మైదానం చిత్తడిగా మారి టాస్​ ఆలస్యమైంది.

43 ఓవర్లు.. 34 ఓవర్లు...

2 గంటల అనంతరం ఇన్నింగ్స్​ను 43 ఓవర్లకు కుదించి మ్యాచ్​ను ప్రారంభించారు. అనంతరం.. ఆరో ఓవర్లో మళ్లీ వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. తిరిగి ప్రారంభమైనా వరుణుడు పదే పదే మ్యాచ్​కు అంతరాయం కలిగించాడు. తర్వాత 34 ఓవర్లకూ కుదించారు. అనంతరం.. మ్యాచ్​ జరిగే పరిస్థితులు లేని కారణంగా తొలి వన్డేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అంపైర్లు. రెండో వన్డే పోర్ట్​ ఆఫ్​ స్పెయిన్​ వేదికగా ఈ నెల 11న జరగనుంది.

మ్యాచ్​ నిలిచిపోయే సమయానికి వెస్టిండీస్​ జట్టు 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఓపెనర్​ లూయిస్​ 36 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. విధ్వంసక ఆటగాడు క్రిస్​గేల్​.. దారుణంగా విఫలమయ్యాడు. 31 బంతులెదుర్కొని 4 పరుగులకే వెనుదిరిగాడు. ఏకైక వికెట్​ కుల్​దీప్​ యాదవ్​కు దక్కింది.

ABOUT THE AUTHOR

...view details