తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ-20 ప్రపంచకప్​కు బంగ్లాదేశ్, థాయ్​లాండ్​ అర్హత - icc

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరగనున్న మహిళల టీ-20 ప్రపంచకప్​లో ఆడనున్న తుది జట్లను ప్రకటించింది ఐసీసీ. క్వాలిఫయింగ్ పోటీల్లో నెగ్గిన థాయ్​లాండ్, బంగ్లాదేశ్​తో కలిపి 10 దేశాలు ఈ టోర్నీలో తలపడనున్నాయి.

మహిళల ప్రపంచకప్

By

Published : Sep 8, 2019, 10:34 AM IST

Updated : Sep 29, 2019, 8:49 PM IST

2020 మహిళల టీ 20 ప్రపంచకప్​లో ఏఏ జట్లు ఆడబోతున్నాయో ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). మొత్తం 10 దేశాలకు అవకాశం దక్కింది. ర్యాంకింగ్స్​లో తొలి 8 స్థానాల్లో ఉన్న జట్లతో పాటు క్వాలిఫయింగ్ పోటీల్లో నెగ్గిన బంగ్లాదేశ్, థాయ్​లాండ్ పొట్టి ప్రపంచకప్​లో పోటీపడనున్నాయి.

అర్హత పోటీల్లో స్కాట్లాండ్​పై నెగ్గిన బంగ్లాదేశ్.. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్​, శ్రీలంకతో తలపడనుంది.

12 ఏళ్ల క్రితమే తన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​ ఆడిన థాయ్​లాండ్ మహిళల జట్టు.. టీ 20 ప్రపంచకప్​కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. గ్రూప్​-బీలో ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్​ జట్లను ఢీకొట్టనుంది.

ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. మొత్తం 23 మ్యాచ్​లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్​లో ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత మహిళల జట్టు.

ఇది చదవండి: యాషెస్ ఆసీస్ వైపు.. ఇబ్బందుల్లో ఇంగ్లాండ్!

Last Updated : Sep 29, 2019, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details