తెలంగాణ

telangana

లాక్​డౌన్ వల్ల వారికే ఎక్కువ నష్టం: పఠాన్

By

Published : Jul 20, 2020, 6:16 AM IST

కరోనా లాక్​డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు క్రికెటర్లు. దీంతో ఫిట్​నెస్ విషయంలో ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలా విరామం రావడం వల్ల బ్యాట్స్​మెన్ కంటే బౌలర్లకే ఎక్కువ ఇబ్బందని తెలిపాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్​.

లాక్​డౌన్ వల్ల వారికే ఎక్కువ నష్టం: పఠాన్
లాక్​డౌన్ వల్ల వారికే ఎక్కువ నష్టం: పఠాన్

కరోనా వైరస్‌ కారణంగా కొన్ని నెలలుగా ఆటలన్నీ నిలిచిపోయిన వేళ ఇప్పుడిప్పుడే కొన్ని క్రీడలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య బయో సెక్యూర్‌ విధానంలో అంతర్జాతీయ క్రికెట్‌ మొదలైంది. భారత్‌లో ఈ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పుడప్పుడే ఇక్కడ ఆటలు తిరిగి కొనసాగేలా కనిపించడం లేదు. దీంతో ఆటగాళ్లు ఎప్పుడు బరిలోకి దిగుతారనే విషయంపై సందిగ్ధం నెలకొంది. కాగా, ఇన్ని రోజుల విశ్రాంతితో ఫిట్​నెస్ సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు ఆటగాళ్లు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ బ్యాట్స్​మెన్ కంటే బౌలర్లు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

"పేస్‌ బౌలర్లు తిరిగి గాడిలో పడాలంటే కనీసం 4-6 వారాల సమయం పడుతుంది. ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆటగాళ్ల శరీరం పట్టు కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి బౌలింగ్‌ చేయాలంటే కష్టతరం. ఇప్పుడు సాధన చేస్తే ఫాస్ట్‌ బౌలర్లు గాయాల బారిన పడే అవకాశం కూడా ఉంది. స్పిన్నర్లు, బ్యాట్స్‌మన్‌ కన్నా పేసర్లు జాగ్రత్తగా ఉండాలి. ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉన్నన్ని రోజులు బౌలర్లకు కష్టమే" అని చెప్పుకొచ్చాడు పఠాన్.

ABOUT THE AUTHOR

...view details