తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీని చూద్దామని వచ్చి.. అభిమానులు మోసపోయారు' - అండర్సన్

మొతేరాలో టీమ్​ఇండియా సారథి కోహ్లీని చూడటానికి వచ్చిన అభిమానులు మోసపోయారని అన్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్. ఎందుకో మీరూ తెలుసుకోండి.

Fans came to watch Kohli face Anderson, almost feels like they have been robbed, says Root
కోహ్లీని చూద్దామని వచ్చిన అభిమానులు మోసపోయారు

By

Published : Feb 26, 2021, 3:23 PM IST

ఇంగ్లాండ్​తో గులాబి (మూడో) టెస్టులో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీని చూడటానికి వచ్చిన అభిమానులు మోసపోయారని ఇంగ్లాండ్ సారథి జో రూట్ అన్నాడు. జిమ్మీ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్​ బౌలింగ్​లో కోహ్లీ ఆడటం చూడాల్సినవారు తాను వికెట్లు తీయటాన్ని వీక్షించారని చెప్పాడు.

"టీమ్​ఇండియా మాపై పూర్తి ఆధిపత్యం సాధించిందన్నది వాస్తవం. దానిని మేం అంగీకరిస్తున్నాం. అద్భుతమైన మైదానం, 60వేల మంది ప్రేక్షకుల మధ్య ఇంత గొప్ప టెస్టు మ్యాచ్​లో పేలవ ప్రదర్శన చేయడం సిగ్గుచేటు. ఇక విరాట్ కోహ్లీని చూడటానికి వచ్చిన అభిమానులు మోసపోయారని భావిస్తున్నా. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో విరాట్​ ఆట చూద్దామని వచ్చిన ప్రేక్షకులు.. నేను వికెట్లు తీయడం చూడాల్సి వచ్చింది."

-జో రూట్, ఇంగ్లాండ్ కెప్టెన్

ఇరు జట్ల క్రికెటర్లకు అలాంటి పిచ్​ సవాలేనని అన్నాడు రూట్. చేయాల్సిందల్లా ముందున్న పరిస్థితులను ఎదుర్కోవడమేనని చెప్పాడు. అలాంటి వికెట్​పై గొప్ప ప్రదర్శన చేసిన టీమ్​ఇండియాకు అభినందనలు తెలిపాడు.

మొతేరాలో జరిగిన మూడో టెస్టులో ఆటపై ఇరు జట్ల స్పిన్నర్లు పూర్తి ఆధిపత్యం చూపారు. ఇంగ్లాండ్ స్టార్​ బౌలర్లు అండర్సన్, బ్రాడ్​లు ఒక్క వికెట్ తీయకున్నా.. ఐదు వికెట్లతో రూట్ అదరగొట్టాడు. అక్షర్ పటేల్, అశ్విన్​ల అద్భుత ప్రదర్శనతో ఈ మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.

ఇదీ చూడండి:'పిచ్​ బానే ఉంది.. బ్యాటింగే చేయలేకపోయాం'

ABOUT THE AUTHOR

...view details