తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అప్పుడు లావుగా ఉండేవాడిని.. ఫిట్​నెస్ కోసం శ్రమించా' - ఐపీఎల్ 2020

అఫ్ఘానిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ కొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా పలు విషయాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నాడీ ఆల్​రౌండర్.

రషీద్
రషీద్

By

Published : Mar 10, 2020, 12:26 PM IST

ఈటీవీ భారత్​తో రషీద్ ఖాన్

నోయిడా: రషీద్ ఖాన్.. క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు. తన ఆల్​రౌండ్ ప్రదర్శనతో అఫ్ఘానిస్థాన్​ జట్టులో కీలకసభ్యుడిగా ఎదిగాడు. విదేశీ లీగుల్లో సత్తాచాటుతూ ఫ్యాన్స్​నూ సంపాందించుకున్నాడు. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాడు. సన్​రైజర్స్ హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహిస్తోన్న రషీద్​.. ఈటీవీ భారత్​తో పలు విషయాలను పంచుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్​లోకి అరంగేట్రం చేసినప్పటి పరిస్థితుల గురించి చెప్పండి?

అక్టోబర్ 18, 2015లో నేను జింబాబ్వేపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడా. ఆ తర్వాత ప్రపంచకప్​​లో పాల్గొన్నా. ఆ సమయంలో నేను లావుగా ఉండేవాడిని. ఫిట్​నెస్ కూడా అనుకున్నంత స్థాయిలో ఉండేది కాదు. విదేశీ లీగ్​ల్లో ఆడేటపుడు శారీరకంగా దృఢంగా ఉండాలని కసరత్తులు మొదలుపెట్టా. విరామం లేకుండా క్రికెట్ ఆడాలంటే ఫిట్​గా ఉండాల్సిందే.

రషీద్ ఖాన్

హైదరాబాద్ బిర్యానీ గురించి

అవును. హైదరాబాద్ బిర్యానీ చాలా ఖ్యాతి గడించింది. ఐపీఎల్​లో మొదటిసారి ఆడినప్పుడు బిర్యానీ తిన్నా. కానీ ఫిట్​నెస్ కోసం తర్వాత మానేశా.

ఇష్టమైన ఆటగాళ్లు, క్రీడల గురించి

అనిల్ కుంబ్లే, షాహిద్ అఫ్రిదీ అంటే ఇష్టం. క్రీడల్లో ఫుట్​బాల్ అంటే మక్కువ. రొనాల్డో ఆటను ఇష్టపడతా.

కామెల్ బ్యాట్​ ఐపీఎల్​లో ఉపయోగిస్తారా?

కౌంటీ క్రికెట్​లో కామెల్ బ్యాట్​తో ఆడినపుడు మంచి ఆదరణ వచ్చింది. ఐపీఎల్​లోనూ కామెల్ బ్యాట్ ఉపయోగిస్తా. ఇంకా అంతకంటే మంచి డిజైన్ బ్యాట్స్ ఉన్నాయి. వాటిని కూడా వాడతా.

రషీద్ ఖాన్

ABOUT THE AUTHOR

...view details