టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ను తిరిగి మైదానంలో చూడటాన్ని అభిమానులు ఇష్టపడతారని మరో మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇటీవలే యూవీ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడిన గంభీర్.. తన అభిప్రాయాలు వెల్లడించాడు.
యువరాజ్ తిరిగి వస్తానంటే.. 'సాదర స్వాగతం' అంటూ గంభీర్ పేర్కొన్నాడు. అయితే, అతను ఎవరి కోసం ఆడాలనుకుంటున్నాడో నిర్ణయించుకోవాలని సూచించాడు.