నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు సాధించింది. ఓపెనర్ జేసన్ రాయ్(46) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. భారత్ తరఫున శార్దూల్ ఠాకూర్ 2, వాషింగ్టన్ సుందర్ 2, చాహల్ 1, భువనేశ్వర్ 1 వికెట్ తీశారు.
ఆదుకున్న రాయ్...
టాస్ ఓడి బ్యాంటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే.. ఓపెనర్ జోస్ బట్లర్‌ను భువనేశ్వర్ కుమార్ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపించాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 1. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలన్‌తో పాటు మరో ఓపెనర్ జేసన్ రాయ్ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. కానీ చాహల్.. తన స్పిన్‌తో మలన్‌ను ఔట్ చేశాడు. మంచి దూకుడు మీద కనపడ్డ రాయ్(46).. ప్రమాదకరంగా మారుతున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ అతడిని పెవీలియన్‌కు పంపించాడు.
మోర్గాన్(28), బెయిర్ స్టో (20), బెన్‌స్టోక్స్(24) ఫర్వాలేదనిపించారు.