కరోనా మహమ్మారి భయపెడుతున్నా మరో టెస్టుకు వేళైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం, మాంచెస్టర్ వేదికగా ఆరంభమయ్యే రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు.. ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. అయితే వర్షం కారణంగా టాస్ వాయిదా పడింది. కాసేపట్లో అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇంగ్లాండ్-వెస్టిండీస్ రెండో టెస్టు టాస్ ఆలస్యం - ఇంగ్లాండ్ వెస్టిండీస్ రెండో టెస్టు
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య జరగబోయే రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. వరుణుడి కారణంగా టాస్ వాయిదా పడింది
ఇంగ్లాండ్-వెస్టిండీస్ రెండో టెస్టు టాస్ ఆలస్యం
మొదటి టెస్టులో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆసక్తిరేపుతోంది. ఆల్‌రౌండ్ సత్తా చాటిన విండీస్ ఆ టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని తపిస్తోంది. గెలిస్తే.. 25 ఏళ్లలో విదేశీ గడ్డపై ఓ పెద్ద టెస్టు దేశంపై టెస్టు సిరీస్ నెగ్గడం విండీస్‌కు ఇదే తొలిసారి అవుతుంది.