తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఏమైనా అర్థం ఉందా.. టీమిండియాకు కపిల్ ప్రశ్నలు

న్యూజిలాండ్​తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓటమిపై స్పందించాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్​దేవ్. మేనేజ్​మెంట్​పై పలు ప్రశ్నలు సంధించాడు.

కపిల్ దేవ్
కపిల్ దేవ్

By

Published : Feb 25, 2020, 3:03 PM IST

Updated : Mar 2, 2020, 12:47 PM IST

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పరాజయంపై మాజీ ఆటగాడు కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే పలు ప్రశ్నలను రేకెత్తాడు. ప్రతి మ్యాచ్​ కోసం జట్టులో మార్పులు చేయడం సరికాదని తెలిపాడు.

"మనం న్యూజిలాండ్ ఆటతీరును ప్రశంసించాలి. వారు చాలా బాగా ఆడుతున్నారు. వన్డే సిరీస్, తొలి టెస్టుల్లో కివీస్‌ ఆడిన తీరు అద్భుతం. ఇక టీమిండియా విషయానికొస్తే. పదకొండు మందితో కూడిన ఓ జట్టును వరుసగా మ్యాచులు ఆడించరా? ప్రతీ మ్యాచ్‌ కోసం జట్టులో మార్పులు చేస్తూనే ఉంటారా? కొంతకాలంగా సీనియర్స్ మినహా ఏ ఒక్క యువ ఆటగాడికైనా జట్టులో శాశ్వత స్థానం కల్పించారా? జట్టులో తన స్థానంపై నమ్మకం లేనప్పుడు ఆ ఆటగాడు మెరుగైన ప్రదర్శన ఎలా చేయగలడు?"

-కపిల్ దేవ్, టీమిండియా మాజీ క్రికెటర్

టీమిండియా బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే కోహ్లీ, పుజరా, రహానేలతో బలంగా ఉందన్న కపిల్​.. వీరు రెండు ఇన్నింగ్స్​ల్లోనూ విఫలమయ్యారని తెలిపాడు. ఈ విషయాన్ని కోహ్లీ అంగీకరించాలని అన్నాడు.

"బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్‌మెన్‌ ఉన్నా తొలి టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో కూడా 200 పరుగులు చేయకపోవడం వింతగా ఉంది. ప్రతిసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు.. కొన్నిసార్లు పోరాడి జయించాలి. వ్యూహాలు, ప్రణాళికలపై దృష్టిపెట్టాలి."

-కపిల్ దేవ్, టీమిండియా మాజీ క్రికెటర్

ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ను టెస్టు జట్టులోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు కపిల్. టీ20, వన్డేల్లో పరుగులు రాబట్టిన ఆటగాడిని పక్కన కూర్చోబెట్టడంలో ఏమైనా అర్థం ఉందా అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

Last Updated : Mar 2, 2020, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details