తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిటైర్మెంట్​పై స్పందించిన రైనా.. ఏమన్నాడంటే? - raina retirement

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ సురేశ్​ రైనా.. తాను ఆలోచించనిదే ఏ నిర్ణయం తీసుకోనని చెప్పాడు. నరనరాల్లో క్రికెట్​ ప్రవహిస్తోందని అంటూ భావోద్వేగ సందేశం పోస్ట్ చేశాడు.

Raina after retirement
రిటైర్మెంట్​పై స్పందించిన రైనా

By

Published : Aug 17, 2020, 5:31 AM IST

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ సురేశ్​ రైనా పంద్రాగస్టున అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికి సహచర ఆటగాళ్లు, క్రీడాభిమానులను షాక్​కు గురి చేశాడు. భవిష్యత్తులో ఇంకా మంచి కెరీర్​ ఉందని, చిన్నవయసులోనే రిటైర్​ ఎందుకు పలికావంటూ చాలామంది ప్రశ్నించారు. తాజాగా దీనిపై స్పందించిన రైనా.. ఆలోచించనిదే ఏ నిర్ణయానికి రానని చెప్పాడు. తన నరనరాల్లో క్రికెట్​ ప్రవహిస్తోందని చెప్పాడు.

"టీమ్​ఇండియాలోకి రాకముందే, నా చిన్న వయసు నుంచే క్రికెట్​ను ప్రాణంగా ప్రేమించా, ఆడా. నాకు తెలిసిందల్లా క్రికెట్​ ఒక్కటే. ఇప్పటి వరకు దానికోసం ఏమి చేయాలో అంతా చేశా. నా నరనరాల్లో ఈ ఆట పాతుకుపోయింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆ దేవుడు, నా కుటుంబం, అభిమానులు.. వారి ఆశీస్సులు నా ఎదుగుదలకు తోడ్పడ్డాయి. నా కుటుంబం, కోచ్​లు, ఫిజిషయన్స్​, ట్రైనర్స్​, సహచర ఆటగాళ్లు, అభిమానులకు ప్రతిఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు. రాహుల్​ భాయ్​, అనిల్​ భాయ్​, సచిన్​ పాజీ, ముఖ్యంగా నా గురువు ధోనీ.. వీరందరీ సారథ్యంలో ఆడటం అదృష్టంగా భావిస్తున్నా. టీమ్​ఇండియాను ఎప్పటికీ మర్చిపోలేను. జైహింద్."​

-రైనా, టీమ్​ఇండియా ఆల్​రౌండర్​

రైనా తన సుదీర్ఘ కెరీర్​లో 226 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టులు ఆడాడు. 2011 ప్రపంచకప్​ విజయంలో భాగస్వాముడయ్యాడు.

ఇది చూడండి ధోనీ.. మీరు ఎప్పటికీ నా కెప్టెనే: కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details