ఐపీఎల్ 12వ సీజన్లో హార్దిక్ పాండ్య తనదైన శైలి ఆటతో రెచ్చిపోతున్నాడు. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పరుగులు సాధిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. హెలికాప్టర్ షాట్‌తోనూ అలరిస్తున్నాడీ యువ ఆటగాడు. ధోనీ ఈ షాట్‌కు ఆద్యుడనీ అందరికీ తెలిసిందే. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మహీ ముందే ఆ షాట్ ఆడి ఆశ్చర్యపరిచాడు. తాజాగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే షాట్ ఆడి ఆకట్టుకున్నాడు.
20 ఓవర్ రబాడా బౌలింగ్‌లో రెండో బంతిని హెలికాప్టర్ షాట్ ద్వారా సిక్సుగా మలిచాడు పాండ్య. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 32 పరుగులు (3 సిక్సులు, రెండు ఫోర్లు) సాధించి ముంబయి 168 పరుగుల చేయడంలో కీలకపాత్ర పోషించాడు.