కళ్లు చెదిరే స్టంపింగ్స్‌తో అదరగొట్టే వికెట్ కీపర్. బెస్ట్ ఫినిషర్. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే వేగం ధోని సొంతం. జులపాల జుట్టుతో కెరీర్ ప్రారంభించి హెలికాప్టర్ షాట్‌తో అభిమానుల మనసు దోచిన మహీ కనపడితే చాలు ఫ్యాన్స్‌కి పూనకాలే. మరోసారి ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
ధోని.. విజిల్ పరక్కుమ్ పారు - chennai super kings
ప్రాక్టీస్ కోసం ధోని మైదానంలో అడుగు పెట్టగానే అభిమానులు చేసిన సందడిని చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో పంచుకుంది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ధోని
అప్పుడే ఐపీఎల్ సందడి మొదలైంది. అన్ని జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా శిక్షణ ప్రారంభించింది. ప్రాక్టీస్ కోసం ధోని మైదానంలో అడుగుపెట్టగానే అభిమానులు ధోని..ధోని అంటూ అభిమానం చాటుకున్నారు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్విట్టర్లో పంచుకుంది.