తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీకి ఆ స్థానంలో బ్యాటింగ్ చాలా ఇష్టం - ధోనీ ఐపీఎల్ 2020

ధోనీ గురించి మాట్లాడిన మాజీ పేసర్ ఆర్పీ సింగ్.. అతడికి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చాలా ఇష్టమని అన్నాడు. గతంలో ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించేవాడు కాదని చెప్పాడు.

ధోనీకి ఆ స్థానంలో బ్యాటింగ్ చాలా ఇష్టం
Dhoni himself wanted to bat at No. 4, says RP Singh

By

Published : Aug 28, 2020, 3:27 PM IST

కెరీర్​ ప్రారంభం నుంచి మిడిలార్డర్​లోని వివిధ స్థానాల్లో ఆడిన మాజీ కెప్టెన్ ధోనీ.. టీమ్​ఇండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఫినిషర్​గానూ అదరగొట్టి మ్యాచ్​ల్ని గెలిపించిన సందర్భాలు అనేకం. అయితే మహీకి ఇష్టమైన స్థానం? అంటే మనం ఐదు లేదా ఆరు అని అనుకుంటాం కానీ అతడికి నాలుగో స్థానమంటే చాలా ఇష్టమని మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ చెప్పాడు.

"ఈ విషయంలో నేను అంచనా తప్పొచ్చు. కానీ నాలుగో స్థానంలో ఆడటమంటే చాలా ఇష్టమని ధోనీనే గతంలో చెప్పాడు. కానీ జట్టు అవసరాల దృష్ట్యా దిగువ స్థానాల్లో అతడు ఆడాల్సి వచ్చిందని నా అభిప్రాయం. నాలుగులో ఆడిన మహీ ఎన్నో మ్యాచ్​ల్ని ఒంటిచేత్తో గెలిపించాడు. మనందరం మైకేల్ బేవన్​ గురించి మాట్లాడుతాం కానీ ధోనీనే ఆ స్థానానికి సరైన బ్యాట్స్​మన్"

-ఆర్పీ సింగ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ధోనీ చాలా మృదు స్వభావి అని, అందరితో చాలా కలిసిమెలసి ఉంటాడని ఆర్పీ సింగ్ తెలిపాడు. కానీ ఫోన్ చేస్తే ఎప్పుడూ రిసీవ్ చేసేవాడు కాదని అన్నాడు. ఈ విషయమై తాను, మునాఫ్ పటేల్ ఓసారి మహీని అడగ్గా, ఇప్పుడు కుదరదని రిటైర్మెంట్​ తీసుకున్నాక సగం రింగ్​కే ఫోన్ ఎత్తి మాట్లాడుతానని చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు మహీకి ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో చూడాలని ఆర్పీ సింగ్ అన్నాడు. ధోనీ నేతృత్వంలో 2007 టీ20 ప్రపంచకప్​ గెల్చుకున్న టీమ్​ఇండియాలో ఇతడు సభ్యుడు.

ABOUT THE AUTHOR

...view details