తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ రిటైర్మెంట్​ ఇప్పుడే కాదులే...'

భారత స్టార్​ క్రికెటర్​ మహేంద్రసింగ్​ ధోనీ రిటైర్మెంట్​పై ప్రస్తుతం విపరీతంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై మహీ సన్నిహితుడు, బిజినెస్​ పార్ట్​నర్, మేనేజర్​​ అరుణ్​ పాండే వివరణ ఇచ్చాడు. టీమిండియా వికెట్​ కీపర్​ ఇప్పట్లో రిటైర్మెంట్​ ప్రకటించే యోచనలో లేనట్లు స్పష్టం చేశాడు.

ధోనీ అప్పుడే రిటైర్మెంట్​ తీసుకోడు: అరుణ్​ పాండే

By

Published : Jul 20, 2019, 6:11 AM IST

Updated : Jul 20, 2019, 8:24 AM IST

టీమిండియా మాజీ సారథి ధోనీ రిటైర్మెంటుపై అతడి మిత్రుడు, వ్యాపార భాగస్వామి, మేనేజర్​ అరుణ్​పాండే కీలక విషయం వెల్లడించాడు. మహేంద్ర సింగ్​ ధోనీ ప్రస్తుతం క్రికెట్​ను వీడే ఆలోచనలో లేడని చెప్పుకొచ్చాడు.

ధోనితో అరుణ్​ పాండే

" ఇంత కంగారుగా ధోనీ క్రికెట్​కు వీడ్కోలు పలికే ఉద్దేశంలో లేడు. అతడి రిటైర్మెంటుపై వస్తోన్న వార్తలు అవాస్తవం".
--అరుణ్​ పాండే, ధోనీ సన్నిహితుడు

ప్రపంచకప్​ సెమీఫైనల్లో న్యూజిలాండ్​ చేతిలో టీమిండియా ఓటమిపాలయ్యాక... ధోనీ రిటైర్మెంట్​ అంశం గురించి చర్చ మొదలై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా అరుణ్​ సమాధానంతో పరోక్షంగా అన్నింటికి చెక్​ పెట్టినట్లయింది.

జులై 21న వెస్టిండీస్​ టూర్​కు భారత జట్టు ఎంపిక జరగనుంది. ఆగస్టు​ 3 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్​లలో ధోనీకి చోటు కల్పిస్తారా.? లేదా.? అన్నది ఆసక్తిగా మారింది. సెలక్షన్​కు రెండు రోజుల ముందు అరుణ్​ పాండే మాటలు కీలకంగా మారాయి. అయితే బీసీసీఐ అధికారులు మాత్రం ఈ విషయంపై ధోనీనే ప్రశ్నించాలంటూ తప్పించుకొంటున్నారు.

ఇవీ చూడండి...సన్​రైజర్స్​కు ప్రపంచకప్ విన్నింగ్ కోచ్

Last Updated : Jul 20, 2019, 8:24 AM IST

ABOUT THE AUTHOR

...view details