తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ-ఫ్లెమింగ్​ కాంబినేషన్ అత్యుత్తమం'

ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​ కోచ్ ఫ్లెమింగ్, కెప్టెన్ ధోనీలపై ప్రశంసలు కురిపించాడు ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్. జట్టు విజయాలు సాధించేందుకు వీరి కాంబినేషన్ ప్రధాన కారణమని చెప్పాడు.

వాట్సన్

By

Published : Aug 15, 2019, 9:01 PM IST

Updated : Sep 27, 2019, 3:18 AM IST

ప్రపంచ క్రికెట్​లో అత్యుత్తమ కెప్టెన్-కోచ్ కాంబినేషన్... మహేంద్ర సింగ్ ధోనీ-స్టీఫెన్ ఫ్లెమింగ్​లదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​ జట్టులో వీరిద్దరూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఇదే జట్టు తరఫున ఆడుతున్నాడు వాట్సన్.

ఫ్లెమింగ్-ధోనీ

"చెన్నై సూపర్ కింగ్స్​తో నా అనుబంధం చాలా ప్రత్యేకం. ఐపీఎల్​లో సీఎస్​కే విజయవంతమవడంలో ఎలాంటి రహస్యం లేదు. అది కేవలం ఫ్లెమింగ్-ధోనీ కాంబినేషన్ వల్లే సాధ్యమైంది. జట్టును సమన్వయంతో నడపడం, ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీయడంలో వీరిద్దరిది కీలకపాత్ర".
- షేన్ వాట్సన్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు

ధోనీ-ఫ్లెమింగ్ కాంబినేషన్ వల్లే సీఎస్​కే.. కచ్చితమైన ప్రణాళికలతో ముందడుగు వేస్తుందన్నాడు వాట్సన్.

"అత్యధిక లీగ్‌ మ్యాచ్‌లు సీఎస్‌కే తరఫునే ఆడాను. కచ్చితమైన మార్గంలో విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది సీఎస్‌కే. ఆ జట్టుకున్న సరైన ప్రణాళికే దీనికి కారణం. ధోనీ-ఫ్లెమింగ్‌ల పాత్రే కీలకం. ప్రపంచంలోనే ఆ ఇద్దరిది అత్యుత్తమ కెప్టెన్‌-కోచ్‌ కాంబినేషన్‌ అని బలంగా నమ్ముతాను".
-వాట్సన్, ఆసీస్ మాజీ ఆటగాడు

2018 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్​లో 57 బంతుల్లో 117 పరుగులు చేసిన వాట్సన్.. సీఎస్​కే కప్పు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.

ఇవీ చూడండి.. కోచ్​గా మెక్​కల్లమ్ కొత్త రోల్​

Last Updated : Sep 27, 2019, 3:18 AM IST

ABOUT THE AUTHOR

...view details