ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది చెన్నై సూపర్ కింగ్స్. ప్రత్యర్థుల బలాలు, బలహీనతల ఆధారంగానే జట్టులోని సభ్యులు అవకాశాలు అందుకుంటారని తెలిపాడు మహీ. తాహిర్ బాగా బౌలింగ్ చేశాడంటూ ప్రశంసలు కురిపించాడు.
"మా జట్టులో పదకొండు మంది నిలకడగా ఆడేవాళ్లే. అయితే రాయల్స్ జట్టులో కుడి చేతివాటం బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఉన్నారు. అందుకే కివీస్ బౌలర్ శాంట్నర్‌కు అవకాశమిచ్చాం. టీంలో ప్రతిసారి మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. జడేజా, శాంట్నర్ ఈ మ్యాచ్‌లో బంతిపై పట్టు సాధించలేకపోయారు. వారిద్దరూ చాలా కష్టపడాల్సి వచ్చింది"
-ధోని, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ప్రారంభంలో తడబడింది. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన ధోని 46 బంతుల్లో 75 పరుగులు సాధించి జట్టు 175 పరుగుల స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.