గురువారం నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్‌లో ఆడేందుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫిట్‌గా ఉన్నాడని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ ప్రకటించాడు. నెట్ ప్రాక్టీస్‌లో వార్నర్ మోకాలికి గాయమైన కారణంగా ఆడతాడో లేదో అని అనుమానాలు వచ్చాయి.
"వార్నర్ ఆరోగ్యంగా ఉన్నాడు. తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడు. మంగళవారం కొంచెం నీరసంగా ఉన్నట్లు కనిపించాడు. కానీ మ్యాచ్ ఆడేందుకు వంద శాతం సిద్ధంగా ఉన్నాడు" -జస్టిన్ లాంగర్, ఆసీస్ ప్రధాన కోచ్